అధ్యాయం – మూడు

సంతానం గాడి క్లాసు టైం అయ్యిందని పరుగున వచ్చాం. తరగతి గదిలోకి అడుగుపెడుతున్న సంతానం ని చూసి బయట నుంచున్నవారందరూ లోపలికి లంఘించారు. ఆయన అడుగుపెట్టిన మరుక్షణం ,ఆయన వెనుక అడుగిడుతున్న వారందరినీ ఆపేసాడు సంతానం. ఆయనకన్నా ఒక అర క్షణం ఆలస్యంగా వచ్చిన కారణాన వారందరినీ వెనుకకి వెళ్ళి నున్చోమని ఆదేశించాడు. వాడి వేపకాయంత వెర్రిని ఉదాహరించటానికి ఇంతకన్నా గొప్ప సంఘటన అక్కర్లేదు. ఆయన వెనువెంటనే ఉన్నవాళ్ళు తప్పించుకోలేక ఇరుక్కుపోగా , కంగారులో బుర్ర పనిచేయని వారు అక్కడే ఆయన ఆదేశాన్ని పాటించటానికి సంసిద్ధం అయిపోతున్నారు. నాలాంటి అతి తెలివి కలవాళ్ళు కొంతమంది మాత్రం అవతలి ద్వారంగుండా లోపలికి జొరబడి ముందే వచ్చినట్టు కూర్చుండిపొయాం. ఆయన వెనకాల ఇరుక్కుపోయిన వాళ్ళలో ఉన్న శేషు నుంచోక తప్పలేదు. సంతానం గాడి పాఠం లో విషయం ఉండదు సరి కదా, తల తిప్పినా ఊరుకోడు, జరిగినా ఊరుకోడు ఆఖరుకి తుమ్మినా ఊరుకోడు.ఎలాగోలా యాభై నిముషాలు అయిపోయాయి ,వీడి నస తప్పింది అనుకుంటూoడంగానే “తర్వాత క్లాసు కూడా నాదే ” అని తనదైన శైలిలో సెలవిచ్చాడు. ఇక అందరి బాధ వర్ణనాతీతం ,నుంచున్న వాళ్ళది మరీనూ. చేసేదేం లేక ,వాడిపై ఉన్న కోపాన్ని , భరించలేక వస్తోన్న ఉక్రోషాన్ని ,పుడుతోన్న ఆకలిని దిగమింది అలానే జీవచ్చవాల్లగా ఉండిపోయాం. ఐదు నిముషాలు గడిచాయి ,అందరి ప్రాణం ఒక్కసారిగా లేచొచ్చింది.సంతానం గాడు ఉన్నవాడు ఊరుకోకుండా మా తరగతి జగమొండి ఝాన్సీ ని లేపాడు. పాఠం ఇక ముందుకి సాగదు, సంతానం గాడి పంబ రేగిందిలే అని మా అందరకి అర్థమైపోయింది. ఝాన్సీ తో వాదులాటకి దిగి మట్టి కరిచి భంగ పడ్డ తోటి ఉపాధ్యాయుల గురించి ఇంకా మైదానమైన సంతానం గాడికి తెల్సినట్టు లేదు. కిందటి ఏడు అయితే పక్క డిపార్టుమెంటు లెక్చరర్ ఒకతను ఏకంగా ఇంక మా డిపార్టుమెంటు కి పాఠం చెప్పటానికి రాను అని అవమానం తట్టుకోలేక మిన్నకుండిపోయాడు. తన తప్పు లేకపోతే ఊరుకోదు, తప్పు ఉంటె అస్సలు ఒప్పుకోదు ఝాన్సి. పక్కకు జరిగినందుకు ఝాన్సి మీద అరిచాడు సంతానం. వినపడినా కూడా చెవి గిల్లుకింటూ దిక్కులు చూస్తూ కూర్చుంది.

“ఏమ్మా ఝాన్సీ !! చెప్పేది నీకే – వినపడలేదా?” అని గొంతు పెంచాడు.

“నన్నా మాస్టారు ? !! ఎమన్నా చెప్పారా? ” అని అమాయకత్వం నటిస్తూ నుంచుంది .

“ఆ !! నిన్నే !! వెనక్కి వెళ్ళి నుంచో “.

“ఎందుకూ ?” మాటలోని అమాయకత్వం మాయమైంది అప్పుడే.

సరైన కారణం దొరక్క తటపటాయిస్తున్నాడని తెలిసిపోతూనే ఉంది. “ముందు వెళ్ళి నుంచో” అని అసలు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. కదలకుండా చురుగ్గా చూస్తున్న ఝాన్సీ ని చూసి మళ్ళీ పొడిగించాడు. “ఎప్పుడు చూసిన అటూ ఇటూ కదులుతూనే ఉంటావ్ .. అసలు పాఠం శ్రద్ధగా వింటునట్టే కనపడవ్ .. మళ్ళి అడిగితే కోపం .. ఇలా ఉంటె ఎలాగమ్మా? ఇంక మార్కులు ఎలా వస్తాయి సరిగా? గురువు మీద భక్తి ,చదువు మీద శ్రద్ధ ఉండాలి.. వెళ్ళి నుంచో ముందు “.

అంతా విని , కూర్చోటానికి చోటు ఉన్నా “జరగండే!!” అని కావాలని జరిగి ఉన్నవాళ్ళ మీద కసిరి తీరిగ్గా సర్దుకుని కూర్చుంది ఝాన్సీ. సంతానం గాడి  మీద చూపుని నల్ల బోర్డు మీదకి తిప్పింది. “సోది ఆపి పాఠం గాల్లోకి చెప్పుకో”  అని చెప్పకనే చెప్తూ. నాకు అప్పటికే నవ్వు తెరలు తెరలుగా తన్నుకోస్తోంది. బలవంతంగా ఉగ్గబట్టి ఆపుకున్నా మిగితా వాళ్ళలాగే. సంతానం గాడికి మొదటి ఝలక్ తగిలింది.

తర్వాత ఏం జరగబోతోందో మా అందరి ఊహకి ముందే అందింది. ఊహించినట్టుగానే “నువ్వు నుంచునే దాక నేను పాఠం చెప్పను” అని మిగితా ఉపాధ్యాయుల్లాగే బోడి శపధం చేసాడు. ఝాన్సీలో చలనం లేదు, చూపు లో మార్పు లేదు. సంతానం గాడు వాడి చితికి వాడే కట్టెలు పెర్చుకుంటునట్టు తయ్యారయ్యింది పరిస్థితి. పాఠం ఇంక కొనసాగించట్లేదు అనట్టు పుస్తకం గట్టిగా మూసాడు. అది చూడగానే గదిలో సగం మందికి పైగా ఠక్కున పుస్తకం మూసేసారు. ఇది సంతానం గాడు పూర్తిగా ఊహించని పరిణామం. దానికి తోడు  వెనక బెంచి పవన్ గాడు “హమ్మయ్య!!” అని గట్టిగా ఆవలించాడు సందట్లో కనపడకుండా. ఝాన్సి పరోక్ష సారధ్యంలో తరగతి లో అందరూ ఎదురు తిరిగారని సంతానం గాడిలో కంగారు మొదలైంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ “ఆఖరు సారి చెప్తున్నా, నువ్వు వెనకెళ్ళి నుంచుంటావా? నేను వెళ్ళిపోనా ?!!” అని బెదిరించినట్టు అర్థించాడు. నల్ల బోర్డు వైపు చూడటం ఆపేసి, జడని ముందుకు లాక్కుని క్లిప్ సవరించుకునే పనిలో పడింది ఝాన్సీ. అందరూ నెమ్మదిగా గుసగుసలాడటం మొదలెట్టారు . పరాజయాన్ని గ్రహించి ఇక చేసేదేం లేక అటూ ఇటూ చూసి, హాజరు పట్టిక చేబూని బయటకి సాగాడు. అడుగు బయట పడిన మరుక్షణం అందరూ అరగంట నుంచి ఉగ్గబట్టి ఆపుకుంటున్న నవ్వు ఒక్కసారి భళ్ళున బయటకొచ్చింది. మట్టి కరిచి వెనుదిరిగిన ఉపాధ్యాయుల సంఖ్యలో సంతానం గాడి పేరు చేరకనే చేరింది.

నుంచున్న వారందరికి విముక్తి కలిగింది. శేషు గాడి వచ్చి నాపక్కన చేరాడు. అందరి బుర్రలు ఖాళీగా సూన్యంతో నిండి ఉన్నాయ్ – విముక్తి తో ,ఆకలి తో. ఇంకా మధ్యానం బ్రేక్ కి పావుగంట ఉందనగానే ,శేఖర్ గాడు వాడి డబ్బా తీసి తినేయ్యటం మొదలెట్టేసాడు. వాడిని చూసి ఇంకొంత మంది కూడా తీసి తినసాగారు. నిశ్శబ్దంగా కూర్చున్న నన్నూ శేషుగాడిని చూసి “నాకు ఖంగారుగా ఉంది,ఏంటి మీ ఇద్దరూ ఇంకా కొట్టుకుంటున్నారా?” అని మా నిశ్శబ్దంలోకి జొరబడ్డాడు. “ముందు నీ పని కానీయ్!! ” అని మా ఇద్దరి మాట ఒకేసారి వాడికి తగిలింది. దాంతో ఒక్కసారిగా మా ఇద్దరి మొహాలు పెద్ద నవ్వుతో నిండుకున్నాయి  – బిత్తర చూపు చూడటం శేఖర్ గాడి వంతైంది.

Advertisements

2 thoughts on “అధ్యాయం – మూడు

    • We all have read third addhyaam and enjoyed it. Now move to the next one , we are waiting for the upcoming episodes.

      This time think really really imaginative ……….:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s