అమ్మమ్మ.com

‘ప్రసూనా !! చిన్నమ్మాయి  పిల్లలూ  వచ్చారు.’  అని కేకవేస్తూ .. ‘ఏరా నల్లాడా ”  అని నన్ను ఏడిపించే మా తాతగారిని దాటుకుని వస్తూ ..

‘వంశీ లాలా ..!!’ అంటూ చటుక్కున వచ్చి నన్ను చేరదీసుకునే మా అమ్మమ్మ అంటే నాకు మా అమ్మంత ఇష్టం. ఇల్లు దాటి బయటకి వచ్చే వరకు నాకు తెలిసిన ప్రపంచం మా ఇల్లు, మా అమ్మమ్మ ఇల్లు అంతే. సెలవలు రాగానే అమ్మమ్మ దగ్గర వాలిపోయేవాడిని. ప్రత్యేకించి క్రితం పదేళ్ళనుంచి మా అమ్మమ్మతో నా అనుబంధం నాకెంతో ప్రియం.  ఆవిడ నా ప్రాణ స్నేహితురాలు. ఎప్పుడూ ఆటలు పాటలు నవ్వులు, ఎన్నో జ్ఞాపకాలు. అమ్మమ్మ అంటే నా స్నేహితులందరికీ కూడా సరదానే.  గుంటూరులో నలుగురు అన్నయ్యలకు గారాల చెల్లిగా పుట్టి, 11 ఏళ్ళకే పెళ్ళి చేస్కొని , 16 ఏళ్ళకి తల్లయ్యి జీవన చట్రం లోని అన్ని బాధ్యతలు సుగమంగా నెరవేర్చి , అందరికీ ఆత్మీయురాలిగా మెలిగి ఈ భౌతిక కాయం వీడి వెళ్ళిపోయింది. నాకు ఈ  అనుబంధాల వీడ్కోలు నచ్చలేదు. అదేదో సినిమాలో అనట్టు ‘ బుద్దికి తెలుస్తోంది కానీ మనసుకి తెలియటం లేదు’ అనట్టు, ఇలా తేరుకోలేని బంధాలు పెంచుకుని, తుంచుకోలేక జీవితాంతం సతమతమవ్వటం కన్నా ఆద్యం నుండి తామరాకు మీద నీటి బొట్టులా అంటీ అంటక ఉండాలనే ఆలోచన బుర్రకి తోచినా , మనసుకి ఎక్కదు. జీవితంలోని ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోవటం ఎప్పటికీ జీర్ణం కాని విషయం. మా అమ్మమ్మకి నేను ఉంటే కొండంత ధైర్యం, సరదా. ఆవిడకి కావలిసినవన్నీ నేనే గ్రహించి అన్ని చేసేవాడిని. అలా  చెయ్యటంలో నాకుండే సంతృప్తి విలువకట్టలేనిది. నేనంటే కూడా అమ్మమ్మకి ప్రత్యేకించి ఎంతో ప్రేమ. శుభ్రత , సంగీతం, మాట మంచితనం, ఛలోక్తులు మా అమ్మమ్మనుంచి మా అమ్మ ద్వారా నాకు సంక్రమించిన జీవన పాటాలు.

PhotoGrid_1367218025569

నంబూరి సత్య జ్ఞాన ప్రసూనాంబ / Namburi Satya Gnaana Prasoonamba ( 4 Nov 1941 – 29 Apr 2013)

ఆరింటి నుంచి పదింటి దాకా వచ్చే సీరియళ్ళన్నీ చూసి చివరికి confuse అవ్వటం-యధాలాపంగా ‘శ్రీ రామ నామం’ రాస్తూ వంట programs చూడటం -నేర్చుకున్న ఇంగ్లీష్ పదాలని వాడటం- తారతమ్యాలు లేకుండా అందర్నీ ఒకేలా చూడటం- పరిస్థితికి తగ్గట్టు మెలగటం-పిచ్చి పోకడల గూర్చి మమ్మల్ని ఎక్కిరించి సున్నితంగా తిట్టటం ;-  ఇవన్నీ ఆవిడలో నాకెంతో ఇష్టమైన అంశాలు. మళ్ళి ఈ అయిహిక బంధాల బారిన పడకుండా , మోక్షం పొంది ఆ భగవంతుని దగ్గరకు చేరుతుందని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా. ammamma, you were/are/will be part of my daily prayers and i’ll miss you dearly  😦

నాకు ఏది Ishtam ?!

భారత దేశం గురంచి ఆలోచించినప్పుడు నా మొట్టమొదటి ఇష్టం మా అమ్మ. మా అమ్మ ద్వారానే భారతీయ సాంప్రదాయాలు విలువలు చూసి నేర్చుకున్నా. సరిగ్గా రెండు నిముషాల ఆలోచనకే నా గుండె బరువెక్కి , మది ఆలోచనల్లో మునిగి , నా మొదటి ఇరవైరెండేళ్ళ జీవితం కళ్ళ ముందు ప్రత్యక్షమై నేటి ప్రస్తుతంలో మాయమైపోతున్నదని శూన్యంలోకి  జారిపోతాను. అమ్మా నాన్నలతో గడిపిన భారతీయ జీవితం ఎప్పటికీ మరువలేని  వరం. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అక్కడే ఉండిపోవాలనుకోవటానికి కారణమయ్యే ఇష్టాలెన్నో …

  1. రోజూ నేను లేచేసరికి అలికి ముగ్గున్న వాకిలి.
  2. వంట గదిలోంచి వండుతూ పాడే మా అమ్మ తీయటి పాట.
  3. రోజూ పెరటిలో పూచే మందారపువ్వు.
  4. సూర్య రశ్మితో నిండే మా ఇల్లు .
  5. నైవేద్యం తర్వాత లభించే కమ్మటి అల్పాహారం.
  6. దేవుడు అనే విశ్వాసంలో భక్తి అనే నిబద్ధతతో అలవరుచుకునే బుద్ధి శ్రద్ధ.
  7. గారాబంగా చూసే నాన్న, ముద్దుగా పిలిచే అమ్మ, ఎప్పుడూ కాచే అన్నయ్య.
  8. షికారుకు తీసుకెళ్ళి నాన్న జిలేబి కొనివ్వటం.
  9. కూపస్తు మండూకాల్లా తెలిసిన ప్రపంచం లోనే ఆనందించటం.
  10. విసుక్కుంటూ గడిపే మండు వేసవి.
  11. హాయి గొల్పే చల్ల నీళ్ళ స్నానం.
  12. రాత్రి భోజనం తర్వాత పెరట్లో వెన్నెల వెలుగులో పిచ్చా పాటి.
  13. మా నాన్న రాకను తెల్పే స్కూటరు శబ్దం.
  14. అమ్మమ్మ ఇల్లు.
  15. దీపావళికి టపాసులు ఎండబెట్టటం.
  16. దసరాకి తెల్లవారుఝామునె దుర్గ గుడికి వెళ్ళటం.
  17. వినాయక చవితికి పట్టు పంచెలు కట్టుకొని కథ చదవటం.
  18. కృష్ణాష్టమికి పాదాల అచ్చులకోసం అమ్మకి కాలు అరువు ఇవ్వటం.
  19. కొబ్బరి చిప్పలో ఆవునేయ్యితో కార్తిక దీపం పెట్టటం.
  20. రథ సప్తమికి అమ్మ వేసే పొడవాటి రథం తోక.
  21. సంక్రాంతి గోబిళ్ళు – భోగి మంట.
  22. అమ్మ చేసే చిరు తిండి.
  23. టీవీ రిమోటు , కంప్యూటర్ , స్కూటర్ , కూలర్ ముందు చోటు కోసం అన్నయ్యతో గొడవపడటం.
  24. ఊగుతూ సాగే రైలు ప్రయాణం.
  25. నేనూ అమ్మ కలిసి పాడే సంగీతం.
  26. నాన్నతో రాజకీయ,ఆర్ధిక,ఆత్యాధ్మిక చర్చలు.
  27. స్నేహితులతో డాబాపై గడిపే కాలం.
  28. అన్నీ పంచుకునేందుకు ఉండే నా వాళ్ళు.

జీవితాన్ని తృప్తిగా గడిపేందుకు ముఖ్యమైన ఈ భావాలన్నీ దీర్ఘాలోచానలోకి తీసుకేల్లెవైతే … the other facet of life that constantly lures me to never turn back into the past  has many other factors:

  1. living not influenced by social prejudice.
  2. roads and my car; can never enjoy a car journey in any other country probably!
  3. transparency of public services and technology usage
  4.  encouragement to all activities and all fun filled sports, unlike ‘just cricket
  5. humility, social politeness and value for human rights.
  6. value for money
  7. dignity of labor
  8. priority to family life – YES, its more prevalent here even in IT field 😛
  9. free education with financial aid ! 🙂
  10. availability of all basic commodities to everybody
  11. growing wisdom and more broad minded approach toward life n others.
  12. deals & discounts 😀
  13. cultural mix and exposure to other ethnicity.
  14. return policies and valid warranties 😉
  15. better productivity and un-influenced lifestyle.
  16. serene surroundings, spell bounding scenic views, white sand beaches, thrilling amusement parks, jaw-dropping resorts n casinos, world class public facilities 😀

Its a dilemma forever whether to choose the practical living conditions against the preserved emotional attachments. God-blessed to experience the best of both worlds and its all about a hope of happy life irrespective of the place :p.