అమ్మమ్మ.com

‘ప్రసూనా !! చిన్నమ్మాయి  పిల్లలూ  వచ్చారు.’  అని కేకవేస్తూ .. ‘ఏరా నల్లాడా ”  అని నన్ను ఏడిపించే మా తాతగారిని దాటుకుని వస్తూ ..

‘వంశీ లాలా ..!!’ అంటూ చటుక్కున వచ్చి నన్ను చేరదీసుకునే మా అమ్మమ్మ అంటే నాకు మా అమ్మంత ఇష్టం. ఇల్లు దాటి బయటకి వచ్చే వరకు నాకు తెలిసిన ప్రపంచం మా ఇల్లు, మా అమ్మమ్మ ఇల్లు అంతే. సెలవలు రాగానే అమ్మమ్మ దగ్గర వాలిపోయేవాడిని. ప్రత్యేకించి క్రితం పదేళ్ళనుంచి మా అమ్మమ్మతో నా అనుబంధం నాకెంతో ప్రియం.  ఆవిడ నా ప్రాణ స్నేహితురాలు. ఎప్పుడూ ఆటలు పాటలు నవ్వులు, ఎన్నో జ్ఞాపకాలు. అమ్మమ్మ అంటే నా స్నేహితులందరికీ కూడా సరదానే.  గుంటూరులో నలుగురు అన్నయ్యలకు గారాల చెల్లిగా పుట్టి, 11 ఏళ్ళకే పెళ్ళి చేస్కొని , 16 ఏళ్ళకి తల్లయ్యి జీవన చట్రం లోని అన్ని బాధ్యతలు సుగమంగా నెరవేర్చి , అందరికీ ఆత్మీయురాలిగా మెలిగి ఈ భౌతిక కాయం వీడి వెళ్ళిపోయింది. నాకు ఈ  అనుబంధాల వీడ్కోలు నచ్చలేదు. అదేదో సినిమాలో అనట్టు ‘ బుద్దికి తెలుస్తోంది కానీ మనసుకి తెలియటం లేదు’ అనట్టు, ఇలా తేరుకోలేని బంధాలు పెంచుకుని, తుంచుకోలేక జీవితాంతం సతమతమవ్వటం కన్నా ఆద్యం నుండి తామరాకు మీద నీటి బొట్టులా అంటీ అంటక ఉండాలనే ఆలోచన బుర్రకి తోచినా , మనసుకి ఎక్కదు. జీవితంలోని ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోవటం ఎప్పటికీ జీర్ణం కాని విషయం. మా అమ్మమ్మకి నేను ఉంటే కొండంత ధైర్యం, సరదా. ఆవిడకి కావలిసినవన్నీ నేనే గ్రహించి అన్ని చేసేవాడిని. అలా  చెయ్యటంలో నాకుండే సంతృప్తి విలువకట్టలేనిది. నేనంటే కూడా అమ్మమ్మకి ప్రత్యేకించి ఎంతో ప్రేమ. శుభ్రత , సంగీతం, మాట మంచితనం, ఛలోక్తులు మా అమ్మమ్మనుంచి మా అమ్మ ద్వారా నాకు సంక్రమించిన జీవన పాటాలు.

PhotoGrid_1367218025569

నంబూరి సత్య జ్ఞాన ప్రసూనాంబ / Namburi Satya Gnaana Prasoonamba ( 4 Nov 1941 – 29 Apr 2013)

ఆరింటి నుంచి పదింటి దాకా వచ్చే సీరియళ్ళన్నీ చూసి చివరికి confuse అవ్వటం-యధాలాపంగా ‘శ్రీ రామ నామం’ రాస్తూ వంట programs చూడటం -నేర్చుకున్న ఇంగ్లీష్ పదాలని వాడటం- తారతమ్యాలు లేకుండా అందర్నీ ఒకేలా చూడటం- పరిస్థితికి తగ్గట్టు మెలగటం-పిచ్చి పోకడల గూర్చి మమ్మల్ని ఎక్కిరించి సున్నితంగా తిట్టటం ;-  ఇవన్నీ ఆవిడలో నాకెంతో ఇష్టమైన అంశాలు. మళ్ళి ఈ అయిహిక బంధాల బారిన పడకుండా , మోక్షం పొంది ఆ భగవంతుని దగ్గరకు చేరుతుందని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా. ammamma, you were/are/will be part of my daily prayers and i’ll miss you dearly  😦

Advertisements

2 thoughts on “అమ్మమ్మ.com

  1. Vamsi,

    Kannillu teppinchav.. ammamma aatma ki shaanthi chekuralani prasdhisthuu..
    yenni computer programs raasina, yenni books chadivina, peddavallu tho maatladithe vache samtrupti veru.. malli alanti rojulu tirigi raavu..

    Sasi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s