పరమావధి

జీవిత లక్ష్యం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపొవటం కన్నా,కావల్సింది ఏంటో తెలిసి మరీ పొందలేకపొవటం దుర్భరం.. అదే విథి.

వైభవ్.. చందమామలా పుట్టబోయే కొడుకు పేరే రామనామం అయ్యింది నీరజకి. తాను తల్లి అవుతోందన్న సంగతి తెలిసిన దగ్గర్నుంచి ఇంకే చింతా మనసుని అంటలేదు. తనకి సంతోషాన్ని బిడ్డ రూపంలో అందివ్వబోతున్న  దేవుణ్ణి  ఇంకా భక్తిగా కొలిచింది.  23 ఏళ్ళు తలిదండ్రుల ప్రేమలో గారాబంగా పెరిగిన నీరజకి, కర్మ సిథాంతం సూర్యని భర్తగా పొందిన వెంటనే  బోధపడింది.అదేదో సినిమాలో అనట్టు సూర్య చెడ్డవాడూ కాదు,అలా అని మంచివాడూ కాదు..మొగుడు అంతే. రెండేళ్ళ దుఖపు చెరనుండి మాతౄత్వం ద్వారా విముక్తి  లభించబోతోంది అని తెలిసిన క్షణం, నీరజ కళ్ళనీళ్ళూ ఎంతకీ ఆగలేదు. 

అనుకునట్టే చందమామలాంటి కొడుకు పుట్టాడు.కానీ ఆనందం ఆవిరి అవ్వటానికి క్షణం పట్టలేదు..బిడ్డ ఏడవలేదు.వరం ఇచ్చినట్టే ఇచ్చి సాశ్వతంగా తన  మనసుకి శిక్ష వేసిన భగవంతుడిని తలచుకొని ఆ తల్లి తల్లడిల్లింది.నిదానంగా తల్లీ బిడ్డలు ఇల్లు చేరారు.గుండ్రటి కళ్ళతో,పాలుగారే బుగ్గలతో, తడి కారుతున్న పెదవులతో రెప్ప వేయకుండా తదేకంగా చూస్తున్న కొడుకుని హత్తుకొని మనసారా ఏడ్చింది.ఇక తన జీవితం వైభవే అని నిర్ధారణకి వచ్చింది.భార్యా బాధ్యతను పాప కర్మం అనుకున్నా,తల్లిగా ఈ బాధ్యత మాత్రం భాగ్యంగానే భావించింది.  ఏడవకుండా ఎప్పుడూ,నవ్వుతూ కనపడే వైభవ్ని చూసినప్పుడల్లా తన బిడ్డలోని లోపం తెలిసేదికాదు.వైభవ్ తప్ప మరో ప్రపంచం లేదు . పసితనం పోయి నెమ్మదిగా ఎదుగుతున్న కొడుకుని చూసి,వాడికి జన్మనిచ్చి తనకే కాకుండా,కొడుక్కి కూడా ఎంత పెద్ద శిక్ష వెసిందో తెలుసుకొని, ఆ క్షణం నుంచి ఇంక భగవత్విశ్వాసంనుంచి  నిష్క్రమించింది. మాటా,నడక సరిగా రాక, మానసికంగ తోటి వారితో కలవలేక ఎప్పుడూ ‘అవా’  అంటూ నీరజనే  ఆశ్రయించే వైభవ్ గురించి అప్పుడే గుబులు పట్టుకుంది నీరజకి,తన తరువాత బిడ్డ జీవితం ఎలా అని. ఎదిగివచ్చిన బిడ్డ పొవటం ఎంత కఠినమో, ఎదగని బిడ్డకన్నా  ముందే తనువు చాలించటం ఇంకా దుర్భరం.

చూస్తూనే పెద్దవాడు అయిపోయాడు వైభవ్. చిన్నప్పుడైతే ఎత్తుకొని ఆడించటానికన్నా వీలు ఉండేది.ఇప్పుడు అదీ లేకుండా పొయింది. ఇక శారీరకంగా  క్షీణిస్తున్న నీరజ, తనకి మిగిలి ఉన్నవి రోజులే అని గ్రహించి వైభవ్ ని  ఒక సేవా సంస్థలో చేర్చి, ఉన్నంతకాలం వాడి చెంతే ఉండాలని అక్కడే చేరింది తాను కూడా. ఇంత కాలం అలవాటు అయిన నీరజని తప్ప మరింకెవరినీ దగ్గరికి రానివ్వటం లేదు వాడు.

పాపాలకు ప్రాయశ్చితం ఇలానా! కర్మఫలితాలు తీరు ఇదా! ఆలొచనలకి సమాధనాం ఉండదని తెలిసినా ప్రయోజనం లేదు.

ఇరవై ఏళ్ళ తరువాత ఆ రాత్రి వేళ, భగవంతుడు కలలోకి వచ్చి నీరజకు తన ఈ జీవిత గమ్యం మోక్షం అని,జీవన కాలం ముగిసింది ఇక చెంతకు రమ్మని  బొధించి అంతర్ధానమయ్యాడు. ఉదుటున మెలుకువ వచ్చి తన తుది స్వాశల్లో,ఎదురుగా నిద్రిస్తున్న వైభవ్ని చూస్తూ, తనకు మోక్షంకన్నా బిడ్డ జీవితమే ముఖ్యం అని కన్నీటి ద్వార పలుకుతూ అయిష్టంగానే  తన పరమావధి చేరుకొంది.

Authors Note: బిడ్డలే  జీవితంగా   బ్రతికిన, బ్రతుకుతున్న   ప్రతీ  తల్లికీ  ఇది  అంకితం. 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s